×
spinner

బటర్ నాన్ । Butter Naan (Without Yeast & Tandoor) in Telugu

4 years ago | Home Cooking Telugu
DESCRIPTION
బటర్ నాన్ అంటే మనకి చాలా ఇష్టం. కానీ చాలా మంది దీన్ని ఇంట్లో తయారుచేసుకోవడం చాలా కష్టం అని అనుకుంటారు. ఈ వీడియోను చూసి ఇంట్లోనే చాలా సులువుగా బటర్ నాన్ను ఎలా తయారుచేయాలో తెలుసుకోండి, ట్రై చేయండి, మంచి గ్రేవీ కర్రీతో వడ్డించుకుని ఎంజాయ్ చేయండి.
#butternaan #teluguvantalu #indianbread
Here's the link to this recipe in English: https://bit.ly/2XcxxKB

తయారుచేయడానికి: 3 గంటల 15 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 5



కావాల్సిన పదార్థాలు

మైదా పిండి - 500 గ్రాములు
ఉప్పు - 1 /2 టీస్పూన్
బేకింగ్ పొడి - 1 టీస్పూన్
బేకింగ్ సోడా - 1 టీస్పూన్
పంచదార - 5 టీస్పూన్లు
నూనె - 3 టీస్పూన్లు
పెరుగు - 1 కప్పు
వేడి నీళ్లు
నూనె - 1 టీస్పూన్
వెన్న
నువ్వులు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి

తయారుచేసే విధానం

ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, బేకింగ్ పొడి, బేకింగ్ సోడా, పంచదార, నూనె, పెరుగు వేసి కలుపుకోవాలి

ఇప్పుడు వేడి నీళ్ళను కొద్దికొద్దిగా వేసుకుంటూ పిండిని పిసికి కలుపుకోవాలి

పిండి ముద్ద తయారైన తరువాత పైన అంతా నూనె రాసుకోవాలి

ఇలా చేసుకున్న తరువాత పిండిని మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి

ఇప్పుడు ఒక పిండి ముద్దని తీస్కుని చపాతి పిండి లాగా ఒత్తుకుని ఒక వైపున నీళ్లు రాసుకోవాలి

ఇప్పుడు నీళ్లు రాసుకున్న నాన్ను అదే వైపున వేడి పెనం మీద పెట్టి కాల్చుకోవాలి

బుడగలు రావడం మొదలైన తరువాత పొయ్యిని కట్టేసుకోవాలి

ఇప్పుడు పొయ్యి మీద గ్రిల్ పెట్టుకుని నాన్ను ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి

ఇప్పుడు రెండు వైపులా కాలిన తరువాత నాన్ మీద వెన్న రాసుకుని నువ్వులు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి

అంతే వేడివేడి నాన్ తయారైపోయినట్టే. దీన్ని మంచి గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com