×
spinner

పెసల పరాఠా Green Gram Paratha in Telugu

4 years ago | Home Cooking Telugu
DESCRIPTION
పరాఠాలను ఉత్తర భారతదేశంలోని వారు ఎక్కువగా తింటుంటారు.వలసలు వెళ్లడం వలన, రెస్టారెంట్లు ఎక్కువగా రావటం వలన మన తెలుగు వారికి కూడా పరాఠాలు పరిచయమయ్యాయి.ఇవాళ మేము మీకు పెసలతో పరాఠాలు ఎలా చేయాలో చూపించబోతున్నాం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి

#Pesalaparatha #greengramrecipes #healthyfood

Here's the link to this recipe in English: https://bit.ly/2Ix9fF3

తయారు చేయుటకు : 4 గంటలు
వండుటకు: 30 నిమిషాలు
సెర్వింగులు: 4 (తలకో రెండు చొప్పున)

కావలసిన పదార్థాలు

పెసల మిశ్రమం కోసం కావాల్సినవి
పెసలు - 1 / 2 కప్పు
నీళ్లు
పచ్చిమిరపకాయలు - 2
వెల్లుల్లి - 5 రెబ్బలు
పసుపు - 1 / 4 టీస్పూన్
కారం - 2 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్

పిండి కోసం కావలసినవి
గోధుమ పిండి - 2 కప్పులు
వాము - 1 / 2 టీస్పూన్
ఉప్పు - 1 / 2 టీస్పూన్
నీళ్లు
నెయ్యి

తయారుచేయు విధానము

ముందుగా అర కప్పు పెసలను మూడు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి

ఒక ప్రెషర్ కుక్కరులో నానపెట్టిన పెసలను అవి నానపెట్టిన నీటితో పాటు వేసి, రెండు పచ్చిమిరపకాయలు, తరిగిన ఐదు వెల్లుల్లి రెబ్బలు, పావు టీస్పూన్ పసుపు, రెండు టీస్పూన్ల కారం, ఒక టీస్పూన్ ఉప్పు కూడా వేసి ఒకసరి కలయపెట్టాలి

ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి పెసలను ఉడికించాలి

ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండి, అర టీస్పూన్ వాము, అర టీస్పూన్ ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి

ఈ పిండిని పది నిమిషాల పాటు పిసికి, ముప్పై నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి

కొద్దిగా పిండిని తీస్కుని చపాతిలాగా ఒత్తుకోవాలి.ఒత్తుకునేటప్పుడు, మధ్యలో భాగంకన్నా అంచులు పలచగా ఉండేట్టు ఒత్తుకోవాలి

ఇప్పుడు ఒక స్పూను అంత పెసల మిశ్రమాన్ని తీస్కుని కొట్టుకున్న చపాతీ పిండి మధ్యలో పెట్టి మళ్ళీ ఉండేలాగా చేసుకోవాలి

ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా చపాతీల్లాగా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి

ఇప్పుడు పెనాన్ని వేడి చేసుకుని పరాఠాలను ఒక్కొక్క వైపు ముప్పై సెకన్ల వరకు కాల్చుకోవాలి (కావాలంటే పైన కొద్దిగా నెయ్యి కూడా రాసుకోవచ్చు)

ఇప్పుడు చాలా ఆరోగ్యకరమైన పెసల పరాఠాలు రెడీ ఐపోయినట్టే. వీటిని రైతాతో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com