×
spinner

హైదరాబాదీ ఎగ్ దమ్ బిర్యానీ Hyderabadi Egg Dum Biryani in Telugu

4 years ago | Home Cooking Telugu
DESCRIPTION
హైదరాబాదీ ఎగ్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ డిష్. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినాకానీ, వారాంతాలప్పుడు మీకే ఏదైనా స్పెషల్గా తినాలనిపించినా కానీ ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. దీన్ని చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు.

Here's the link to this recipe in English: https://bit.ly/32rfpyq

#HyderabadiEggDumBiryani #biryanirecipes #HyderabadiBiryani

తయారుచేయడానికి : 30 నిమిషాలు
వండటానికి : 35 నిమిషాలు
సెర్వింగులు : 2

కావలసిన పదార్థాలు

గుడ్లు - 6 (ఉడకపెట్టినవి)

ఉల్లిపాయలు వేయించడానికి కావలసినవి
ఉల్లిపాయలు - 4
నూనె - 1 టేబుల్స్పూన్

అన్నం ఉడికించడానికి కావలసినవి
బాస్మతి బియ్యం - 200 గ్రాములు
దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలక్కాయ, లవంగం, మిరియాలు, అనాస పువ్వు
ఉప్పు

నెయ్యి - 1 టేబుల్స్పూన్
బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, అనాస పువ్వు, యాలక్కాయ
పచ్చిమిరపకాయలు - 2 - 3
అల్లం వెల్లులి పేస్ట్ - 1 టీస్పూన్
పసుపు - 1 / 2 టీస్పూన్
ఎండుకారం - 1 టీస్పూన్
బిర్యానీ మసాలా - 1 1 / 2 టీస్పూన్
పెరుగు - 1 కప్పు
ఉప్పు
కొన్ని పుదీనా ఆకులు
కుంకుమ పువ్వు - చిటికెడు
పాలు - 2 టేబుల్స్పూన్లు
కొత్తిమీర
గోధుమ పిండి

తయారుచేయు విధానం
స్టెప్ 1 :
గుడ్లను ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి

స్టెప్ 2 :
ఉల్లిపాయలను కొద్దిగా నూనెలో వేయించి అవి బ్రౌన్ రంగులోకి మారిన తరవాత పక్కన పెట్టుకోవాలి

స్టెప్ 3 :
బాస్మతి బియ్యాన్ని ముప్పై నిమిషాల పాటు నీళ్లలో నానపెట్టి ఆ తరవాత కుక్కర్లో బాస్మతి బియ్యంతో పాటు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలక్కాయ, లవంగం, మిరియాలు, అనాస పువ్వు, ఉప్పు కూడా వేసి పూర్తిగా కాకుండా సగం మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ సగం ఉడికిన బియ్యాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి

స్టెప్ 4: దమ్ బిర్యానీ తయారుచేసుకోవడం
ఒక పెద్ద గిన్నెలో నెయ్యి వేసి అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు వేసుకోవాలి

ఇప్పుడు పాచ్మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మరియు ఎండుకారం కూడా వేసుకోవాలి

ఇప్పుడు బిర్యానీ మసాలా పొడిని వేసి, ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను కూడా సగం వేసుకోవాలి

ఇప్పుడు ఒక కప్పు పెరుగు, ఉప్పు, పుదీనా ఆకులు కూడా వేసి ఒకసారి మొత్తం కలయపెట్టుకోవాలి

ఇప్పుడు ఉడికించిన గుడ్లకు గాట్లు పెట్టి వాటిని కూడా ఈ మసాలా మిశ్రమంలో వేసుకోవాలి

ఇప్పుడు ఈ పెద్ద గిన్నెను పొయ్యి మీద నుంచి తీసేసి ఒక పెద్ద పెనం మీద పెట్టుకోవాలి

ముందుగా సగం ఉడికించుకున్న అన్నాన్ని మసాలా మీద ఒక పొరలాగా గుడ్లను మూసేట్టుగా పరుచుకోవాలి

ఇప్పుడు దాని పైన కుంకుమపువ్వు కలిపిన పాలు, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకోవాలి

చివరగా పైన వేయించిన ఉల్లిపాయలను వేసుకుని మూత పెట్టేసి చపాతీ పిండితో అంచులను మూసేయాలి

ఇప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు దమ్ పట్టేట్టుగా మగ్గనివ్వాలి

అంతే, మూత తెరిచి దమ్ బిర్యానీని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com