×
spinner

మటన్ కర్రీ । Mutton Curry in Telugu

4 years ago | Home Cooking Telugu
DESCRIPTION
మటన్లో సహజంగానే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మరి అలాంటి మటన్తో ఒక మంచి కర్రీ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇవాళ మీకోసం మటన్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చాము. ఈ వీడియోను చూసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#muttoncurry #teluguvantalu #muttonrecipes

Here's the link to this recipe in English: https://bit.ly/2W9M0qh

తయారుచేయడానికి : 30 నిమిషాలు
వండటానికి : 1 గంట 30 నిమిషాలు
సెర్వింగులు : 5 - 6


కావలసిన పదార్థాలు

మసాలా పేస్టు చేయడానికి కావలసినవి:

నూనె - 1 టీస్పూన్
ధనియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 2 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 10
చిన్న ఉల్లిపాయలు - 12
వెల్లుల్లి - 8 రెబ్బలు
అల్లం - 1 (ముక్క తరిగినది)
తురిమిన కొబ్బరి - 2 టేబుల్స్పూన్లు
నీళ్లు

మటన్ కర్రీ చేయడానికి కావలసినవి:

మటన్ - 1 కిలో
నువ్వుల నూనె - 3 టేబుల్స్పూన్లు
దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ, అనాస పువ్వు
చిన్న ఉల్లిపాయలు - 20 (తరిగినవి)
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు - 2 (చీల్చినవి)
కరివేపాకులు
టొమాటోలు - 4 (చిన్నగా తరిగినవి)
పసుపు - 1 / 2 టీస్పూన్
కల్లు ఉప్పు - 1 టేబుల్స్పూన్

తయారుచేసే విధానం

ఒక పాన్ను వేడి చేసి కొద్దిగా నూనె వేసి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు గింజలు, ఎండుమిరపకాయలు వేసి నూనె లేకుండా వేయించుకోవాలి

ఇందులో చిన్న ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి

ఇప్పుడు ఇందులో తురిమిన కొబ్బరి వేసి దాన్ని కూడా కొద్దిగా వేయించుకోవాలి

ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద నుంచి తీసి చల్లార్చుకోవాలి

ఈ చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీలో వేసుకుని, మెత్తటి పేస్టులాగా రుబ్బుకోవాలి

ఇప్పుడు ఒక మట్టి పాత్రలో కొద్దిగా నూనె వేసి వేడి చేసి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి

ఇందులో తరిగిన చిన్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి

ఇందులో కరివేపాకులు, టొమాటోలు కూడా వేసి వేయించుకోవాలి

ఇప్పుడు కొద్దిగా పసుపు, కళ్ళు ఉప్పు కూడా వేసి టొమాటోలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి

ఇందులో మటన్ ముక్కలు వేసి ఐదు నిమిషాలపాటు వేయించుకోవాలి

ఇప్పుడు ముందుగా రుబ్బుకుని పెట్టుకున్న మసాలా పేస్టును కూడా వేసి మరొక రెండు నిమిషాలపాటు వేయించుకోవాలి

ఇందులో వేడి నీళ్లు పోసి ఒకసారి అంతా కలయపెట్టాలి

ఇప్పుడు మూత పెట్టి మటన్ను 45 నిమిషాల నుండి ఒక గంట పాటు ఉడికించుకోవాలి

చివరగా కొన్ని కరివేపాకులు వేసి మటన్ కర్రీను వేడిగా ఇడ్లి, దోశ, అప్పమ్, ఐడియాప్పం, వేడి అన్నం లాంటివాటితో కలిపి తింటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com