×
spinner

రవ్వ లడ్డు Rava Ladoo in Telugu

4 years ago | Home Cooking Telugu
DESCRIPTION
రవ్వ లడ్డూలను చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపిస్తే ఇవి చకచకా చేసుకోవచ్చు. అందుకే ఇవాళ రవ్వ లడ్డు రెసిపీని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వీడియోను చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి.

#ravvaladdu #sweetrecipes #dessertrecipes

Here's the link to this recipe in English : https://bit.ly/2VMdeCQ

తయారుచేయడానికి : 15 నిమిషాలు
వండుటకు : 10 నిమిషాలు
సెర్వింగులు : 15 (తలకో రెండు చొప్పున)

కావలసిన పదార్థాలు

నెయ్యి
బొంబాయి రవ్వ - 2 కప్పులు
పంచదార - 1 1 / 2 కప్పులు
యాలకుల పొడి - 1 టీస్పూన్
పాలు - 1 / 4 కప్పు
జీడిపప్పులు
కిస్మిస్లు

తయారుచేయు విధానం

ఒక పాన్లో నెయ్యి వేసి వేడి చేసి జీడిపప్పులు కిస్మిస్లు

ఇంకొద్దిగా నెయ్యి వేసి అందులో బొంబాయి రవ్వ వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి

ఒక మిక్సీలో పంచదారను మెత్తటి పొడిలా పట్టుకోవాలి

ఇప్పుడు పొడి పట్టిన పంచదారలో వేయించిన బొంబాయి రవ్వకూడా వేసి ఒకట్రెండుసార్లు తిప్పుకోవాలి

ఒక గిన్నెలోకి పంచదార బొంబాయి రవ్వ పొడి మిశ్రమాన్ని మార్చి అందులో వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు, కరిగించిన నెయ్యి, తగినన్ని పాలు వేసి మొత్తం కలుపుకోవాలి

ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చుట్టి రవ్వ లడ్డును సర్వ్ చేసుకోవడమే

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com