×
spinner

సాంబార్ Sambar in Telugu

4 years ago | Home Cooking Telugu
DESCRIPTION
మన ఇళ్లల్లో చాలా తరుచుగా సాంబార్ తయారుచేసుకుంటూ ఉంటాము. ఇది అన్నంలోకి, అలానే ఇడ్లీ దోశలోకి కూడా తింటాము. బయట హోటళ్లలో కూడా మనకి చాలా రుచికరంగా ఉండే సాంబార్ తప్పకుండా వడ్డిస్తారు. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకనే ఇవాళ చక్కటి సాంబర్ని ములక్కాడ, వంకాయలు వేసుకుని సౌత్ ఇండియన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ చూసి తెలుసుకోండి.

#sambarrecipe #teluguvantalu #southindianrecipes

Here's the link to this recipe in English: https://bit.ly/2JucUE1

తయారుచేయడానికి : 20 నిమిషాలు
వండటానికి : 30 నిమిషాలు
సెర్వింగులు : 3

కావలసిన పదార్థాలు

సాంబార్ పొడి చేయడానికి కావలసినవి

మినపప్పు - 1 టేబుల్స్పూను
సెనగపప్పు - 1 టేబుల్స్పూను
ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్స్పూను
మెంతులు - 1/4 టీస్పూను
మిరియాలు - 1 టీస్పూను
ఎండు మిరపకాయలు - 10
ఎండుకొబ్బరి తురుము - 1/4 కప్పు

సాంబార్ చేయడానికి కావలసిన పదార్థాలు
నూనె
మినపప్పు - 1 టీస్పూను
సెనగపప్పు - 1 టీస్పూను
ఆవాలు - 1/2 టీస్పూను
ఎండుమిరపకాయలు - 2
ఇంగువ - 1/4 టీస్పూను
కరివేపాకులు
చిన్న ఉల్లిపాయలు - 20
పెద్ద టొమాటోలు - 2 (చిన్నగా తరిగినవి)
వంకాయలు - 6
పెద్ద మునక్కాయ - 1
ఉప్పు - 1 టీస్పూను
పసుపు - 1/4 టీస్పూను
చింతపండు రసం - 1 కప్పు
నీళ్లు - 3 కప్పులు
ఉడికించిన కందిపప్పు
సాంబార్ పొడి - 2 టేబుల్స్పూన్లు
కొత్తిమీర

తయారుచేయాల్సిన విధానం

అర కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా నీటితో కడిగి పెట్టుకోవాలి

ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కరులో కందిపప్పు వేసి అది ఉడికించడానికి తగినన్ని నీళ్లు పొయ్యాలి

పావు టీస్పూన్ పసుపు కూడా ఇందులో వెయ్యాలి

నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కరుని మీడియం ఫ్లేము మీద ఉంచి పప్పుని ఉడికించాలి

ఇప్పుడు ఉడికిన పప్పుని పక్కన పెట్టుకుని సాంబార్ పొడి తయారుచేయడానికి ఒక పాన్ను వేడి చేసుకోవాలి

ఇందులో ఒక టేబుల్స్పూన్ సెనగపప్పు, ఒక టేబుల్స్పూన్ మినప్పప్పు వేసి వేయించుకోవాలి

ఇప్పుడు రెండు టేబుల్స్పూన్లు ధనియాల పొడి, ఒక టేబుల్స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి

ఇందులో పావు టీస్పూన్ మెంతులు, ఒక టీస్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలి

ఇందులో పది ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి

ఇవన్నీ రంగు మారేంత వరకు వేయించుకోవాలి

ఇప్పుడు పావు కప్పు తురిమిన ఎండుకొబ్బరి వేసుకోవాలి। ఒకవేళ ఎండుకొబ్బరి లేనట్లయితే పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు

ఇవన్నీ వేయించి పక్కన పెట్టి చల్లారనివ్వాలి

ఇప్పుడు ఈ పదార్థాలన్నిటినీ ఒక మిక్సీలో వేసి మెత్తటి పొడిలాగా పట్టుకోవాలి

ఒక బాండీలో నూనె వేసి వేడి చేసి, అందులో ఒక టీస్పూన్ మినపప్పు, ఒక టీస్పూన్ సెనగపప్పు , అర టీస్పూన్ ఆవాలు వేసి వేగనివ్వాలి

ఇందులో రెండు ఎండుమిరపకాయలు, పావు టీస్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి వేయించుకోవాలి

ఇప్పుడు ఇరవై చిన్న ఉల్లిపాయలు వేసి ఒకసారి కలయపెట్టాలి

ఇవి కొద్దిగా వేగిన తరువాత రెండు పెద్ద టొమాటోలు వేసి అవి కూడా వేయించుకోవాలి

ఇందులో ఆరేడు వంకాయలు, ఒక ములక్కాడ వేసి వేయించుకోవాలి

ఇప్పుడు ఒక టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి

ఇందులో ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి

ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి పది-పదిహేను నిమిషాలపాటు ఉడకనివ్వాలి

చింతపండు రసం చిక్కపడిన తరువాత ఉడికించిన పప్పుని వేసి కలపాలి

ఇప్పుడు మళ్ళీ రెండు కప్పుల నీళ్లను పోసి బాగా కలుపుకోవాలి

ఇప్పుడు రెన్డు టేబుల్స్పూన్లు ముందుగా తయారుచేసి పెట్టుకున్న సాంబార్ పొడిని వేసి ఒక ఉడుకు రానివ్వాలి

ఇప్పుడు ఐదు నిమిషాల పాటు సాంబార్ను మరిగించాలి

చివరగా సాంబారుపైన కొత్తిమీర చల్లుకుని పొయ్యి కట్టేసి వేడిగా వడ్డించుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com