×
spinner

తెలంగాణా చికెన్ Telangana Chicken in Telugu

4 years ago | Home Cooking Telugu
DESCRIPTION
తెలంగాణా చికెన్ చాలా రుచికరంగా ఉండే ఒక డిష్. ఇది కొద్దిగా కారంగా ఉంటుంది. దీన్ని వేడివేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి, తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి.

#telanganachicken #teluguvantalu #chickenrecipes

Here's the link to this recipe in English: https://bit.ly/2N2iijV

తయారుచేయడానికి - 10 నిమిషాలు
వండటానికి - 30 నిమిషాలు
సెర్వింగులు - 4

కావలసిన పదార్థాలు

చికెన్ - 350 గ్రాములు
నూనె - 2 టేబుల్స్పూన్లు
కరివేపాకులు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు
పసుపు - 1/2 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
నీళ్లు - 1/2 కప్పు
గరం మసాలా - 1 టీస్పూన్
కొత్తిమీర

మసాలా పొడి చేయడానికి కావలసినవి

ధనియాలు - 1/2 టేబుల్స్పూన్
గసగసాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 2 టీస్పూన్లు
ఎండుమిరపకాయలు - 10
తురిమిన కొబ్బరి - 2 టేబుల్స్పూన్లు

తయారుచేసే విధానం

ముందుగా ఒక పాన్లో పచ్చికొబ్బరి తురుము, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు వేసి నూనె లేకుండా వేయించుకోవాలి

ఇవి చల్లారిన తరువాత ఒక మిక్సీలోకి వేసి మెత్తటి పొడిలాగా తయారుచేసుకోవాలి

ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్లో నూనె వేసి వేడి చేసుకుని కరివేపాకులు వేయించుకోవాలి

ఇందులో ఉల్లిపాయలు వేసి అవి రంగు మారేంత వరకూ వేయించుకోవాలి

ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి ఒక నిమిషంపాటు వేయించుకోవాలి

ఇందులో చికెన్ వేసి, కొద్దిగా నీళ్లు పోసి చికెన్ను ఉడికించుకోవాలి

ఇప్పుడు మనం ముందుగా తయారుచేసిపెట్టుకున్న మసాలా పొడిని వేసి, చికెన్ను చక్కగా మగ్గనివ్వాలి

చివరగా గరం మసాలా, కొత్తిమీర కూడా వేసుకోవాలి

ఇప్పుడు రుచి చూసుకుని, సరిపడా ఉప్పు వేసుకుని పొయ్యి కట్టేసుకోవచ్చు

దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com