×
spinner

వెజ్ మంచూరియన్ Veg Manchurian in Telugu

4 years ago | Home Cooking Telugu
DESCRIPTION
చైనీస్ ఫుడ్ అనగానే మనకి వెంటనే గుర్తుకువచ్చేది మంచూరియన్. మన అందరం దీన్ని ఎంతో ఇష్టంగా తింటుంటాము. అందుకే ఇవాళ మీముందుకు వెజిటబుల్ మంచూరియన్ రెసిపీతో వస్తునాం. ఈ వీడియోని చూసి ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.

#vegmanchurian #chinesefood #telugurecipes

Here's the link to this recipe in English: https://bit.ly/2VPETTG

తయారుచేయడానికి : 10 నిమిషాలు
వండటానికి : 30 నిమిషాలు
సెర్వింగులు : 5 -6

కావలసిన పదార్థాలు

క్యారెట్ - 1 (తరిగిన)
క్యాబేజి - 1 (చిన్నగా తరిగిన)
ఫ్రెంచ్ బీన్స్ - 2 (తరిగిన)
కాప్సికం - 1 / 2 (చిన్నగా తరిగిన)
తరిగిన అల్లం - 1 / 2 టీస్పూన్
తరిగిన వెల్లుల్లి - 1 / 2 టీస్పూన్
ఉల్లికాడలు - 2 టీస్పూన్లు
ఉల్లికాడల గడ్డలు - 2 టీస్పూన్ల
రుచికి సరిపడా ఉప్పు
మిరియాలు
మైదా పిండి - 3 టీస్పూన్లు
కార్న్ ఫ్లోర్ - 2 టీస్పూన్లు
వేయించడానికి సరిపడా నూనె

మంచూరియన్ సాస్ కోసం కావలసినవి
నూనె - 2 టీస్పూన్లు
తరిగిన అల్లం - 1/2 టీస్పూన్లు
తరిగిన వెల్లుల్లి - 1/2 టీస్పూన్లు
ఉల్లికాడల గడ్డలు - 1/4 కప్పు
ఉల్లికాడలు - 2 టీస్పూన్లు
వెనిగర్ - 2 టీస్పూన్లు
సొయా సాస్ - 2 టీస్పూన్లు
రెడ్ చిల్లి సాస్ - 3 టీస్పూన్లు
టొమాటో కెచప్ - 2 టేబుల్స్పూన్లు
చిటికెడు ఉప్పు
మిరియాల పొడి - 1/4 టీస్పూన్
కొన్ని నీళ్లు
ఉల్లికాడలతో గార్నిష్ చేసుకోవాలి

తయారుచేసే విధానము
ఒక బౌల్లో తరిగిన క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, కాప్సికం, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు, ఉల్లికాడల గడ్డలు, ఉప్పు, మిరియాల పొడి, మైదా మరియు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి

అన్నిటినీ కలిపిన తరువాత కూరగాయలు నీళ్లు విడుదల చేస్తాయి। ఈ నీరు మంచూరియన్ బాల్స్ తయారుచేయడానికి సరిపోతుంది

ఒకవేళ ఉండలు చుట్టడానికి కుదరకపోతే కొద్దిగా మైదా వేసుకోవచ్చు

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి

ఒక బాండీలో నూనె వేసి వేడి చేసుకోవాలి

అందులో ముందుగా తయారుచేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ను వేసి బంగారు రంగులోకి వచ్చేంత వరకు వెయించుకోవాలి

పొయ్యిని లో-ఫ్లేములో మాత్రమే ఉంచి వేయించుకోవాలి। లేదంటే బాల్స్ లోపల సరిగా ఉడకవు

ఒక పాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లికాడలు, ఉల్లికాడల గడ్డలు వేసి కొద్దిగా వేయించాలి

ఇప్పుడు వెనిగర్, సొయా సాస్, రెడ్ చిల్లి సాస్, టొమాటో కెచప్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి

ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి సాస్ను వేయించుకోవాలి

సాస్ దగ్గరపడిన తరువాత వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసి ఒకసారి కలయపెట్టుకోవాలి

ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com