×
spinner

వెజిటబుల్ సమోసా । Vegetable Samosa in Telugu

4 years ago | Home Cooking Telugu
DESCRIPTION
స్నాక్స్ అనగానే మనకి ముందుగా గుర్తోచేవి సమోసాలు. ముఖ్యంగా ఆలూ సమోసా అంటే మన అందరికి మరీ ఇష్టం. ఇవి బయట ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఎక్కడంటే అక్కడ తినేస్తూ ఉంటారు. ఇలా తరచుగా చేస్తుంటే ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి ఇంట్లోనే చేసుకుని తింటే సరదాగా ఉంటుంది. ఇంట్లో ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? అందుకే మీకోసం ఇవాళ సులువుగా చేసుకోగలిగే వెజిటల్ సమోసా రెసిపీని చూపిస్తున్నాం. ఈ రెసిపీని చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలూ పెద్దలూ అందరు ఆస్వాదిస్తారు.

#vegetablesamosa #aloosamosa #samosarecipes

Here's the link to this recipe in English: https://bit.ly/2AWAkxa

తయారుచేయడానికి : 60 నిమిషాలు
వండటానికి : 45 నిమిషాలు
సెర్వింగులు : 4 (తలకో రెండు చొప్పున)

కావలసిన పదార్థాలు

పిండి చేయటానికి కావలసినవి :

మైదాపిండి - 2 కప్పులు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
పంచదార - 1 టీస్పూన్
వాము - 1 / 2 టీస్పూన్
నూనె - 2 టేబుల్స్పూన్
నీళ్లు

స్టఫ్ఫింగ్ చేయడానికి కావలసినవి :

బంగాళాదుంపలు - 6
బఠాణీలు - 1 / 4 కప్పు
నూనె - 1 టేబుల్స్పూన్
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
జీడిపప్పులు
కిస్మిస్లు
ఉల్లిపాయ - 1 (తరిగిన)
పచ్చిమిరపకాయలు - 3
అల్లం - 1 టీస్పూన్ (చిన్నగా తరిగిన)
గరం మసాలా - 1 టీస్పూన్
చాట్ మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - 1 / 2 టీస్పూన్
కొత్తిమీర
నీళ్లు
వేయించడానికి సరిపడా నూనె

తయారుచేయవలసిన విధానం

ముందుగా మైదాపిండి, పంచదార, ఉప్పు, వాము, నూనె,నీళ్లు అన్నీ పైన చెప్పిన మోతాదులో తీస్కుని చపాతీముద్దలాగా కలుపుకోవాలి

మైదా ముద్దని మరీ ఎక్కువగా పిసకకూడదు

ఇప్పుడు మైదా ముద్ద మీద కొద్దిగా నూనె రాసుకుని మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి

ఒక ప్రెషర్ కుక్కర్లో బంగాళాదుంపలు, బఠాణీలు వేసి ఉడికించుకోవాలి

బంగాళాదుంపలు చల్లారిన తరువాత వాటి తోలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి

ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి అందులో జీలకర్ర, జీడిపప్పులు, కిస్మిస్లు వేసి వేయించుకోవాలి

అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి

ఇప్పుడు తరిగిన అల్లం కూడా వేసి వేయించుకోవాలి

ఇవన్నీ కొద్దిగా వేగిన తరువాత ఉడకపెట్టిన బంగాళాదుంపలు, బఠాణీలు వేసుకోవాలి

ఇప్పుడు గరం మసాలా, చాట్ మసాలా మరియు ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి

చివరగా కొత్తిమీర వేసి మళ్ళీ బాగా కలుపుకొని పొయ్యి కట్టేసుకోవాలి

ఇప్పుడు మైదా పిండిముద్దను చిన్న చిన్న ఉండలుగా తీస్కుని గుడ్డు ఆకారంలో వచ్చేట్టు ఒత్తుకొవాలి

దీన్ని మధ్యలోకి సగం సగం వచ్చేట్టు కట్ చేసుకోవాలి

ఇప్పుడు ఒక సగం ఒత్తిన చపాతీని తీస్కుని కోన్ ఆకారంలోకి మడుచుకోవాలి

మనం ముందుగానే చేసి పెట్టుకున్న బంగాళాదుంప స్టఫ్ఫింగ్ను కోన్కు మధ్యలో పెట్టుకోవాలి

ఇప్పుడు కోన్కు ఉన్న అంచులని నీటితో కొద్దిగా తడిపి మూసేయాలి

ఇప్పుడు బాండీలో వేయించుకోడానికి సరిపడా నూనె పోసి కొద్దిగా వేడి చేసుకోవాలి

తయారుచేసి పెట్టుకున్న సమోసాలను జాగ్రత్తగా బాండీలోకి వేసుకొని వేయించుకోవాలి

సమోసాలు బంగారు రంగులోకి మారిన తరువాత బయటకు తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి (ఇలా చేస్తే సమోసాల మీదున్న నూనెను టిష్యూ పేపర్లు పీల్చుకుంటాయి)

ఇప్పుడు వేడి వేడి సమోసాలను పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com