×
spinner

బేబీ కార్న్ మంచూరియన్ । Baby Corn Manchurian in Telugu

3 weeks ago | Home Cooking Telugu
DESCRIPTION
బేబీకార్న్ మంచూరియన్ చాలా మంచి ఇండో-చైనీస్ రెసిపీ. ఇది చాలా రుచికరంగా ఉండే ఒక స్టార్టర్. దీన్ని హోటల్ స్టైలులో వచ్చేట్టుగా ఇంట్లోనే చాలా సులువుగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకోడానికి ఈ వీడియోను చూడండి, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#babycornmanchurian #teluguvantalu #manchurianrecipes

Here's the link to this recipe in English: https://bit.ly/2NRBNMx

తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 3 - 4

కావలసిన పదార్థాలు

బేబీ కార్న్ - 400 గ్రాములు
మైదా - 3 టేబుల్స్పూన్లు
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్స్పూన్లు
రుచికి సరిపడా ఉప్పు
మిరియాల పొడి
నీళ్లు
నూనె
తరిగిన వెల్లుల్లి రెబ్బలు
తరిగిన అల్లం
ఉల్లిపాయ - 1
కాప్సికం - 1 / 2
సొయా సాస్ - 1 టేబుల్స్పూన్
టొమాటో కెచప్ - 3 టేబుల్స్పూన్లు
చిల్లి సాస్ - 2 టేబుల్స్పూన్లు
ఉల్లికాడల గడ్డలు
ఉల్లికాడలు

తయారుచేసే విధానం

ముందుగా ఒక బౌల్లో కట్ చేసుకున్న బేబీకార్న్ ముక్కలను వేసి, అందులో కొద్దిగా మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి

వీటన్నిటిని టాస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి

ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి, బేబీకార్న్కు ఈ మైదా, కార్న్ఫ్లోర్ మిశ్రమం బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి

ఇప్పుడొక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి, వేడి చేసి, బేబీకార్న్ ముక్కలని వేడి నూనెలో వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించుకొని, పక్కన పెట్టుకోవాలి

ఇప్పుడొక పాన్లో కొద్దిగా నూనె వేసి, అందులో తరిగిన వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ, కాప్సికం వేసి వేయించుకోవాలి

దీనిలో సొయా సాస్, టమాటో కెచప్, రెడ్ చిల్లి సాస్ వేసి బాగా కలుపుకోవాలి

ఇందులో ఉల్లికాడల గడ్డలు, వేయించుకున్న బేబీకార్న్ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి

చివరగా ఉల్లికాడల, మిరియాల పొడి వేసి పొయ్యి కట్టేసుకోవాలి

అంతే, వేడివేడి బేబీకార్న్ స్టార్టర్లాగా సర్వ్ చేసుకుని తినచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com