×
spinner

మినప గారెలు Minapa Garelu in Telugu

2 weeks ago | Home Cooking Telugu
DESCRIPTION
పండగలప్పుడే కాదు, విడిగా చేసుకుని తినడానికి కూడా గారెలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి కాబట్టి వీటిని అందరూ ఇష్టపడతారు. వీటిని ఇంట్లోనే సులువుగా ఎలా చేయాలో ఈ వీడియోని చూసి తెలుసుకోండి, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#minapagarelu #teluguvantalu #meduvadarecipe

Here's the link to this recipe in English: https://bit.ly/346SVUa

తయారుచేయడానికి: 6 గంటలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 6 - 7
కావాల్సిన పదార్థాలు

మినపప్పు - 1 కప్పు
కొద్దికొద్దిగా నీళ్లు పోసుకోవాలి
ఉప్పు - 1/2 టీస్పూన్
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
కరివేపాకులు
వేయించడానికి సరిపడా నూనె

తయారుచేసే విధానం

మినపప్పుని నాలుగు గంటల పాటు నీళ్ళల్లో నానపెట్టాలి

ఇప్పుడు పప్పుని వడకట్టి, ఒక మిక్సీ జారులో వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరీ జారుగా కాకుండా కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలి

ఇప్పుడు ఈ పిండిని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి

రెండు గంటల తరువాత ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు వేసి బాగా కలపాలి

ఇప్పుడొక అరిటాకు తీసుకుని, కొద్దిగా నీళ్లతో కడగాలి

రుబ్బుకున్న పిండిని కొద్దిగా తీసుకుని, అరిటాకులో పెట్టి, మధ్యలో కన్నం పెట్టి గారెలలాగా ఒత్తుకోవాలి

ఇప్పుడొక బాండీలో నూనె వేసి వేడి చేసి, నెమ్మదిగా గారెలని వేసుకుని, అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించుకోవాలి

వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com