×
spinner

మైసూర్ బోండా /Mysore Bonda in telugu

1 week ago | Home Cooking Telugu
DESCRIPTION
వేడివేడి మైసూర్ బోండాలంటే మన అందరికి ఎంతో ఇష్టం. కానీ చాలా మందికి ఇది ఇంట్లో ఎలా చేయాలో తెలీదు. అందుకే ఇవాళ మీకోసం మైసూర్ బోండాలను రెస్టారెంట్ స్టైల్లోలాగా వచ్చేటట్టు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. ఈ రెసిపీని చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.

#mysorebonda #instantrecipes #snacks

Here's the link to this recipe in English: https://bit.ly/2oXm8RD

తయారుచేయడానికి : 10 నిమిషాలు
వండటానికి : 20 నిమిషాలు
సెర్వింగులు: 4 - 5

కావలసిన పదార్థాలు

మైదా పిండి - 2 కప్పులు
బియ్యం పిండి - 1 / 4 కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
పెరుగు - 1 /2 కప్పు
వంట సోడా - 1 / 4 టీస్పూన్
ఉల్లిపాయ - 1 (తరిగినది)
పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి)
అల్లం - 1 చిన్న ముక్క (తరిగినది)
తరిగిన కరివేపాకులు
తరిగిన కొత్తిమీర
నీళ్లు
ఉప్పు
నూనె

తయారుచేయు విధానము

ఒక బౌల్లో మైదా, బియ్యప్పిండి, వంట సోడా,జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి

ఇందులో పెరుగు, నీళ్లు కూడా వేసి అన్నిటిని బాగా కలపాలి

ఈ మిశ్రమాన్ని మొత్తం ఉండలులేకుండా ఉండేలాగా కలుపుకోవాలి

ఈ పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకులు, కొత్తిమీర వేసి మళ్ళీ కలుపుకోవాలి

ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసి వేడి చేసుకోవాలి

ఇప్పుడు బొండాల పిండిని తీస్కుని చిన్నచిన్న ఉండలుగా బాండీలోకి వేసుకోవాలి

ఇప్పుడు బోండాలని అన్నివైపులా వేయించుకోవాలి

వేడివేడి బోండాలను కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవాలి

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com