×
spinner

పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై । Pomfret Fish Fry in Telugu

4 weeks ago | Home Cooking Telugu
DESCRIPTION
పోమ్ఫ్రెట్ ఫిష్ ఫ్రై చాలా సింపుల్ డిష్. ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది. దీన్ని చాలామంది చందువా చేప అంటారు, సందువా చేప అని కూడా అంటారు. ఈ పోమ్ఫ్రెట్ ఫిష్ను ఫ్రై చేసుకుని సంబార్లోకి సైడ్ డిష్ లాగా తింటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం ఈ రెసిపీని చూసి, తప్పకుండా ట్రై చేసి, ఎంజాయ్ చేయండి.

#Pomfretfishfry #teluguvantalu #fishrecipes

Here's the link to this recipe in English: https://bit.ly/2Ma4bFL

తయారుచేయడానికి: 25 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 1

కావలసిన పదార్థాలు

పోమ్ఫ్రెట్ చేప / సందువా చేప - 1
సెనగపిండి - 2 టీస్పూన్లు
కొబ్బరినూనె
కరివేపాకులు

మసాలా పేస్టు చేయడానికి కావలసినవి

వెల్లుల్లి
కాశ్మీరీ ఎండుకారం - 4
ఉప్పు
పసుపు - 1 / 4 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
నీళ్లు

తయారుచేసే విధానం

ముందుగా మసాలా పేస్టు చేసుకోడానికి ఒక మిక్సీలో అల్లం, వెల్లుల్లి, నానపెట్టిన కాశ్మీరీ ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, నీళ్లు వేసి మెత్తటి పేస్టులాగా రుబ్బుకోవాలి

ఇప్పుడు రుబ్బుకున్న మసాలా పేస్టులో సెనగపిండిని కలుపుకోవాలి

పోమ్ఫ్రెట్ చేపను చక్కగా శుభ్రం చేసుకుని మసాలా మొత్తం చేపలోపలకు ఇంకడానికి చేపకు నిలువుగా గాట్లు పెట్టుకోవాలి

ఇప్పుడు చేపకు మసాలా పేస్టును మొత్తం పైన రెండువైపులా రాసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలి

చేప మసాలా పేస్టులో నానినతరువాత, ఒక బాండీలో కొబ్బరినూనె వేసి వేడి చేసుకోవాలి

ఇందులో మ్యారినేట్ చేసిన చేపను వేసి, కొద్దిగా ఫ్లేవర్ కోసం కరివేపాకులు కూడా వేసుకోవాలి

ఇప్పుడు చేపను రెండువైపులా ఐదేసి నిమిషాలపాటు వేయించుకోవాలి

పూర్తిగా వేగిన తరువాత పోమ్ఫ్రెట్ ఫిష్ ఫ్రై తయారైపోయినట్టే. దీన్నిప్లేటులోకి మార్చుకుని సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com