×
spinner

ప్రాన్ పెప్పర్ ఫ్రై Prawn Pepper Fry in Telugu

1 month ago | Home Cooking Telugu
DESCRIPTION
మిరియాలు వేసి రొయ్యలను ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇదే మనకి రెస్టారెంట్స్లో ప్రాన్ పెప్పర్ ఫ్రై పేరుతో దొరుకుతుంది. ఇది చాలా రుచికరమైన డిష్. అందుకే ఇవాళ మీ ముందుకు రొయ్యల పెప్పర్ ఫ్రై రెసిపీని తీసుకొస్తున్నాము. ఈ వీడియోను చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి.

#prawnpepperfry #prawnrecipes #royyalu

Here's the link to this recipe in English: https://bit.ly/2MmRWJf

తయారుచేయడానికి : 5 నిమిషాలు
వండటానికి : 25 నిమిషాలు
సెర్వింగులు : 2

కావలసిన పదార్థాలు

ప్రాన్ - 200 గ్రాములు
నువ్వుల నూనె - 1 టేబుల్స్పూన్
మసాలా దినుసులు - (దాల్చిన చెక్క, లవంగం & యాలకులు)
ఎండు మిరపకాయలు - 3
ఉల్లిపాయ - 1 (తరిగినది)
కరివేపాకులు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 /2 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్

మసాలా పొడి చేయడానికి కావలసినవి

ధనియాలు - 2 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 1 టేబుల్స్పూన్

తయారుచేయు విధానం

మసాలా పొడి చేయుటకు

ఒక పాన్లో రెండు టీస్పూన్లుధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర మరియు 1 టేబుల్స్పూన్ మిరియాలు నూనె లేకుండా వేయించుకుని కాసేపు చల్లారనివ్వాలి. ఆ తరువాత బరకగా పొడి పట్టుకోవాలి

ఒక పాన్ను వేడి చేసి అందులో ఒక టేబుల్స్పూన్ నువ్వుల నూనె, దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ, మూడు ఎండుమిరపకాయలు వేసి వేయించాలి

ఆ తరువాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కూడా వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి

ఇప్పుడు కొన్ని కరివేపాకులు, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి

ఇవన్నీ బాగా వేగిన తరువాత ఉప్పు, పసుపు నీటితో కడిగిన రెండు వందల గ్రాముల రొయ్యలను వేసుకోవాలి

పొయ్యిని లో-ఫ్లేమ్లో ఉంచి తగినంత ఉప్పు వేసుకోవాలి

ఇప్పుడు మూడు టీస్పూన్లు ముందుగా దంచుకున్న మసాలా పొడిని వేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి

వేడిగా సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com