×
spinner

మటన్ బిర్యానీ Pressure Cooker Mutton Biryani in Telugu

1 month ago | Home Cooking Telugu
DESCRIPTION
మటన్ బిర్యానీ చాలా మందికి ఫేవరెట్ డిష్. అందుకే ఇవాళ ఇంట్లోనే చాలా సులువుగా ప్రెషర్ కుక్కరులో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాము. ఈ రెసిపీని చూసి మీరు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#muttonbiryani #teluguvantalu #biryanirecipes

Here's the link to this recipe in English: https://bit.ly/2J7HRxH

తయారుచేయడానికి: 30 నిమిషాలు
వండటానికి: 35 నిమిషాలు
సెర్వింగులు: 8 - 10

కావలసిన పదార్థాలు

మటన్ - 1 కిలో
పసుపు - 3 /4 టీస్పూన్
కారం - 2 టీస్పూన్
రుచికి సరిపడా ఉప్పు

మసాలా పేస్ట్ చేయడానికి కావలసినవి

చిన్న ఉల్లిపాయలు - 6
వెల్లుల్లి రెబ్బలు
అల్లం
పచ్చిమిరపకాయలు - 2
ఎండుమిరపకాయలు - 6
తురిమిన కొబ్బరి - 2 టీస్పూన్లు
పుదీనా ఆకులు
కొత్తిమీర
ధనియాల పొడి - 1 టీస్పూన్
నీళ్లు

ప్రెషర్ కుక్కర్లో ఉడికించడానికి కావలసినవి

నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
నూనె- 1 టేబుల్స్పూన్
దాల్చిన చెక్క
యాలకులు
లవంగాలు
బిర్యానీ ఆకులు
ఉల్లిపాయలు - 4 (సన్నగా తరిగినవి)
టొమాటో - 3 (తరిగినవి)
రుచికి సరిపడా ఉప్పు
డైల్యూట్ చేసిన కొబ్బరిపాలు - 3 కప్పులు
కొత్తిమీర
పుదీనా ఆకులు
బాస్మతి బియ్యం - 3 కప్పులు


తయారుచేసే విధానం

ఒక బౌల్లో మటన్, పసుపు, ఎండుకారం, ఉప్పు వేసి మటన్ ముక్కలకు బాగా పట్టేట్టుగా అన్నిటినీ బాగా కలుపుకోవాలి

ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి

ఇప్పుడు మసాలా పేస్టు కోసం ఒక మిక్సీలో చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తురిమిన కొబ్బరి, పుదీనా ఆకులు, కొత్తిమీర, ధనియాల పొడి వేసుకోవాలి

ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్టులాగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి

బాస్మతి బియ్యాన్ని ముప్పై నిమిషాల పాటు నీళ్ళలో నానపెట్టుకోవాలి

ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో నెయ్యి, నూనె వేసి వేడి చేసుకుని మసాలా దినుసులన్నీ(దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యాని ఆకులు) వేసుకోవాలి

ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి రంగు మారేంత వరకు వేయించుకోవాలి

ఆ తరువాత టొమాటోలు కూడా వేసి ఇంకొద్దిసేపు వేయించుకోవాలి

ఇప్పుడు రుబ్బుకున్న మసాలా పేస్టు వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి

ఇందులో మ్యారినేట్ చేసిపెట్టుకున్న మటన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి

ఇప్పుడు డైల్యూట్ చేసిన కొబ్బరిపాలు, కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసి మటన్ను ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి

మటన్ బాగా ఉడికిన తరువాత రుచి చూసుకుని సరిపడా ఉప్పు వేసుకోవాలి

ఇప్పుడు పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి కుక్కరులో నానపెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి ఏడూ నిమిషాల పాటు వేయించుకోవాలి

పొయ్యి కట్టేసి ఐదు నిమిషాలపాటు మూత తీయకుండా అలానే ఉంచాలి

ఇప్పుడు మటన్ బిర్యానీ తయారైపోయినట్టే. దీన్ని రైతాతో కానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com