×
spinner

పుదీనా పులావ్ Pudina Pulao in Telugu

1 month ago | Home Cooking Telugu
DESCRIPTION
పుదీనా నోటి దుర్వాసనని తొలగిస్తుంది. పుదీనా జలుబును కూడా దరిచేరనివ్వదు. ఇది జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తుంది. పుదీనాని తరుచుగా ఆహరంలో తీసుకోవడం వలన ఇలాంటి మరెన్నో ఉపయోగాలున్నాయి. అందుకే ఇవాళ మేము మీకోసం చాలా రుచికరంగా ఉండే పుదీనా పులావు రెసిపీని మీముందుకి తీసుకుని వచ్చాము. ఈ రెసిపీని మీరందరూ తప్పుకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి, ఆరోగ్యంగా కూడా ఉండండి.

#pudinapulao #teluguvantalu #pulaorecipes

Here's the link to this recipe in English: https://bit.ly/34mRWPo

తయారుచేయడానికి : 15 నిమిషాలు
వండటానికి : 45 నిమిషాలు
సెర్వింగులు : 4 - 5

కావలసిన పదార్థాలు

నెయ్యి - 3 టేబుల్స్పూన్లు
మసాలా దినుసులు - (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయ, అనాస పువ్వు, జీలకర్ర, మిరియాలు)
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
టొమాటో - 1 (సన్నగా తరిగినది)
ఉప్పు - 2 టీస్పూన్లు
గరం మసాలా - 1 టీస్పూన్
పుదీనా ఆకులు
కొత్తిమీర
బాస్మతి బియ్యం - 300 మిల్లీలీటర్లు
నీళ్లు - 600 మిల్లీలీటర్లు

మసాలా పేస్టు చేయడానికి కావలసినవి

అల్లం- 1 ఇంచ్ ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 3
పచ్చిమిరపకాయలు - 5
పుదీనా ఆకులు- గుప్పెడు
కొత్తిమీర - గుప్పెడు
తురిమిన కొబ్బరి - 1/4 కప్పు
కొద్దిగా నీరు

తయారుచేసే విధానం
మసాలా పేస్టు చేయాల్సిన పద్దతి

ఒక చిన్న మిక్సీలో పుదీనా ఆకులు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొబ్బరి, నీళ్లు వేసి మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి

పులావు చేయాల్సిన పద్దతి
ఒక ప్రెషర్ కుక్కరులో నెయ్యి వేసి అందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి

ఇవన్నీ సువాసన వచ్చేంత వరకూ మీడియం ఫ్లేములో ఉంచి వేయించుకోవాలి

ఇప్పుడు జీడిపప్పులు వేసి అవి రంగు మారేంత వరకూ వేయించుకోవాలి

ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి

ఇప్పుడు తరిగిన టొమాటోలు వేసి అవి మగ్గేంత వరకూ వేయించాలి

ఇప్పుడు ముందుగా తయారుచేసుకున్న మసాలా పేస్టును వేసి వేయించుకోవాలి

ఇందులో పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి

ఇప్పుడు గరం మసాలా పొడి, ఉప్పు వేసి ఒకసారి కలయపెట్టాలి

ఇందులో బాస్మతి బియ్యం వెయ్యాలి

ఈ మిశ్రమాన్ని ఒకసారి జాగ్రత్తగా కలయపెట్టిన తరువాత 600 మిల్లీలీటర్లు నీళ్లు పోసుకోవాలి

అంతా ఒకసారి కలయపెట్టిన తరువాత పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి 2 విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి

పులావు ఉడికిన తరువాత 15 నిమిషాలపాటు కుక్కరులోపల మగ్గనివ్వాలి

ఇప్పుడు పుదీనా పులావుని వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com