×
spinner

స్టఫ్డ్ బిట్టర్ గౌర్డ్ Stuffed bitter gourd recipe in Telugu

2 weeks ago | Home Cooking Telugu
DESCRIPTION
కావలసిన పధార్థాలు

కాకరకాయలు (Karela) - 1/2 కిలో
ఉప్పు

మసాలా పొడి చేయుటకు

ధనియాలు - 1 టేబుల్స్పూన్
జీలకర్ర - 1 టేబుల్స్పూన్
సోంపు గింజలు - 1 టీస్పూన్
కలోంజీ గింజలు (నల్ల జీలకర్ర) - 1/2 టీస్పూన్
మెంతులు - 1/4 టీస్పూన్
ఆంచూర్ పొడి (మామిడి పొడి) - 1 టేబుల్స్పూన్
ఎండుకారము - 2 టీస్పూన్లు
పసుపు - 1/2 టీస్పూన్
ఇంగువ - 1/2 టీస్పూన్

కూర్చడానికి కావలసినవి

ఆవ నూనె - 1 టేబుల్స్పూన్
ఉల్లిపాయ - 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 టీస్పూన్
దంచుకున్న మసాలా పొడి - 3 టేబుల్స్పూన్లు
ఉప్పు - 1/2 టీస్పూన్
పంచదార - 1 టీస్పూన్

తయారుచేసుకునే విధానము
ముందుగా ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, కలోంజీ గింజలు మరియు మెంతులను ఒక
బాణలిలో వేసి నూనె లేకుండా వేయించుకోవాలి (రోస్ట్ చేసుకోవాలి)
ఇవన్నీ చల్లారిన తరువాత ఒక మిక్సీలోనికి మార్చుకోవాలి
ఇప్పుడు వీటికి తోడుగా ఆంచూర్ పొడి, ఎండుకారము, పసుపు, ఇంగువ వేసి అన్నిటికి
మెత్తటి పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు కాకరకాయల చివర తొడిమలు తీసేసి చక్కగా కడిగి దానిలోపల ఉన్న గింజలను
తొలగించేయాలి
గింజలు తొలగించిన తరువాత కాకరకాయలమీద, లోపల, అంతటా ఉప్పుతో కాస్త
అదిమిపెట్టి రాసుకోవాలి
ఉప్పు రాసిన కాకరకాయలను ఒక 20 నిమిషాలు పక్కన ఉంచాలి

ఒక బాణలి వేడి చేసి అందులో కాస్త నూనె, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్
వేసి బాగా వేగనివ్వాలి
పైన చెప్పిన విధంగా తయారుచేసుకున్న మసాలా పొడిని కూడా వేసి ఇంకాసేపు
వేయించుకోవాలి
ఈ స్టఫ్ఫింగ్ బాగా చల్లారేవరకు పక్కన పెట్టేయాలి
ఇప్పుడు ఉప్పు రాసుకున్న కాకరకాయలను శుభ్రంగా ఒకటికి రెండుసార్లు నీళ్లతో కడగాలి।
ఇలా చేస్తే కాకరకాయలలో కాస్త చేదు తగ్గుతుంది
కడిగిన కాకరకాయలలో ముందుగా చేసుకున్న స్టఫ్ఫింగ్ను కూర్చి పెట్టుకుని ఒక చిన్న
దారంతో కాకరకాయలను విడిపోకుండా కట్టుకోవాలి
ఒక బాణలి తీస్కుని అందులో నూనె వేసి, కాకరకాయలు చక్కగా బ్రౌన్ (ముదురు గోధుమ)
రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి
చివరగా మనము ముందుగా పట్టిపెట్టుకున్న మసాలా పొడిని కాకరకాయల మీద చల్లుకుని
పొయ్యి ఆపెసుకోవాలి
పైన ఉన్న దారాన్ని తీసేసి ఈ స్టఫ్డ్ కాకరకాయలను వేడి అన్నంలో నెయ్యి
వేసుకుని లేదా రోటీలతో పాటు తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి