×
spinner

టొమాటో పులావ్ Tomato Pulao in Telugu

1 week ago | Home Cooking Telugu
DESCRIPTION
సాధారణంగా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా అయిపోయే ఉప్మా, దోశ లాంటి టిఫిన్లను చేసుకుని తింటాము. కానీ ఇవాళ మేము మీకు చూపించబోయే వంటకాన్ని కేవలం ఉల్లిపాయలు, టొమాటోలతో చేసుకోవచ్చు. అదే టొమాటో పులావ్. ఇది ఎలా చేయాలో ఈ రెసిపీని చూసి తెలుసుకోండి, తప్పకుండా ట్రై చేయండి.

#tomatopulao #ricerecipes #pulaorecipes

Here's the link to this recipe in English: https://bit.ly/31JOi1b

తయారుచేయడానికి: 30 నిమిషాలు
వండుటకు: 30 నిమిషాలు
సెర్వింగులు: 4 - 5

కావలసిన పదార్థాలు

నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
మసాలా దినుసులు - దాల్చిన చెక్క, యాలక్కాయ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, రాతి పువ్వు
జీడిపప్పులు
బాస్మతి బియ్యం - 1 కప్పు
టొమాటో - 4 (తరిగినది)
ఉల్లిపాయ - 2 (సన్నగా తరిగినవి)
పసుపు - 1 /4 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
కాశ్మీరీ ఎర్రకారం - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
పంచదార - 1 /2 టీస్పూన్
కొత్తిమీర
పుదీనా ఆకులు
నీళ్లు - 1 1 /2 కప్పులు

మసాలా పేస్ట్ కోసం:

అల్లం- 1 ఇంచి ముక్క
వెల్లుల్లి - 2 రెబ్బలు
పచ్చిమిరపకాయలు
ఉల్లిపాయ - 1 / 2
ఎండుమిరపకాయలు - 5
పుదీనా ఆకులు
కొత్తిమీర
నీళ్లు

బూందీ రైతా కోసం:

పెరుగు - 200 మిల్లీలీటర్లు
ఉప్పు - 1 / 4 టీస్పూన్
బూందీ - 1 /3 కప్పు
పుదీనా ఆకులు

తయారుచేయు విధానము

ముందుగా బాస్మతి బియ్యాన్ని ముప్పై నిమిషాలపాటు నీళ్ళల్లో నానపెట్టాలి। ఇలా చేయడం వలన అన్నం ఉడికిన తరువాత ముద్దముద్దగా కాకుండా పొడిపొడిలాడుతూ ఉంటుంది

ఒక మిక్సీలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీడిపప్పులు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి

ఒక బాండీలో నూనె వేసి వేడి చేసి అందులో మసాలా దినుసులు, జీడీపప్పులు వేసి వేగనివ్వాలి

ఇప్పుడు ఇందులో రుబ్బుకున్న పేస్ట్ వేసి కాసేపు వేగనివ్వాలి

ఇందులో తరిగిన ఉల్లిపాయలు, వేసి వేయించిన తరవాత ధనియాల పొడి, ఎర్ర కారం, పసుపు, ఉప్పు, పంచదార కూడా వేసి ముప్పై సెకన్ల పాటు కలయపెట్టాలి. పంచదార వేయడం వలన టొమాటోలు నుండి వచ్చే అసిడిటీ తగ్గుతుంది

ఇప్పుడు తరిగిన టొమాటోలను వేసి అన్ని బాగా కలపాలి

టొమాటోలను ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి

ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసి ఒకసారి కలయపెట్టాలి

ఇలా మసాలాను తయారుచేసుకున్న తరువాత నానపెట్టిన బాస్మతి బియ్యాన్ని కూడా వేసి ఒకసారి జాగ్రత్తగా కలయపెట్టాలి

ఇప్పుడు నీళ్లు పోసి ఒక మరుగు వచ్చిన తరువాత పొయ్యిని తక్కువ ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తరువాత ప్రెషర్ కుక్కర్కి విజిల్ పెట్టి ఒక్క విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి

ఇప్పుడు పొయ్యి కట్టేసి పది నిమిషాల పాటు విజిల్ని తీయకుండా అలానే ఉండనివ్వాలి

బూందీ రైతా కోసం పెరుగులో ఉప్పు, పుదీనా ఆకులు వేసి కలపాలి. చివరగా పైన బూందీను వేసి ఉంచాలి

పది నిమిషాల తరవాత బూందీ రైతాతో కలిపి టమాటో పులావ్ని సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com