×
spinner

Pulihora in Telugu

2 weeks ago | Home Cooking Telugu
DESCRIPTION
పండగలప్పుడే కాదు, మాములుగా కూడా మన అందరం పులిహోర తినడానికి ఇష్టపడతాము. అందుకే ఇవాళ మీ ముందుకు రెగ్యులర్ రెసిపీ కాకుండా కాస్త వెరైటీగా ఉండే పులిహోర రెసిపీని తీసుకొస్తున్నాం. దీన్ని చూసి మీరందరు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#pulihora #ricerecipes #tamarindrice

Here's the link to this recipe in English: https://bit.ly/31OkUHb

తయారుచేయడానికి కావలసిన సమయం : 1 గంట
వండుటకు కావలసిన సమయం : 45 - 50 నిమిషాలు
సెర్వింగులు - 4

కావలసిన పదార్థాలు

మసాలా పొడి కోసం:

సెనగపప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
మిరియాలు - 1 /4 టీస్పూన్
మెంతులు - 1 /4 టీస్పూన్
నువ్వులు - 1 టీస్పూన్
ధనియాలు - 2 టీస్పూన్లు
ఎండుమిరపకాయలు - 5
ఇంగువ - 1 /4 టీస్పూన్

చింతపండు పేస్ట్ కోసం:

చింతపండు ముద్ద
నీళ్లు
నువ్వులు నూనె - 3 టేబుల్స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
సెనగపప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
వేరుశెనగలు
ఎండుమిరపకాయలు - 3
ఇంగువ - 1 /4 టీస్పూన్
కరివేపాకులు
పసుపు - 1 /2 టీస్పూన్
ఉప్పు
బెల్లం
ఉడికిన అన్నం

తయారుచేసే విధానము:

ఒక పాన్ తీస్కుని మీడియం ఫ్లేమ్లో ఉంచి,అందులో ఒక టీస్పూన్ సెనగపప్పు, ఒక టీస్పూన్ మినపప్పు, పావు టీస్పూన్ మిరియాలు, పావు టీస్పూన్ మెంతులు, ఒక టీస్పూన్ నువ్వులు, రెండు టీస్పూన్లు ధనియాలు, ఐదు ఎండుమిరపకాయలు వేసి నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి

ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి మారిన తరువాత పొయ్యి కట్టేసి పావు టీస్పూన్ ఇంగువ వేసి కలపాలి

ఇది చల్లారిన తరవాత మిక్సీలో పొడి పట్టుకోవాలి

ఇప్పుడు ఒక బంతి సైజు చింతపండును తీస్కుని రెండు కప్పుల నీళ్లలో ఒక గంట పాటు నానపెట్టాలి

గంట తరువాత చింతపండును బాగా పిసికి, శుభ్రపరుచుకోడానికి ఆ నీళ్లను వడకట్టుకోవాలి

ఒక వెడల్పాటి పాన్ తీస్కుని అందులో మూడు టేబుల్స్పూన్ల నువ్వుల నూనె వేసి, అందులో ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీస్పూన్ సెనగపప్పు, ఒక టీస్పూన్ మినప్పప్పు, గుప్పెడు వేరుశెనగలు, మూడు ఎండుమిరపకాయలు, పావు టీస్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు, అర టీస్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి

ఇప్పుడు చింతపండు పేస్ట్ని పాన్లో వేసి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి చిక్కగా అయ్యేంతవరకు ఉడికించాలి

ఇప్పుడు దీంతో ఉప్పు, బెల్లం, పట్టిపెట్టుకున్న మసాలా పొడి వేసి మీడియం-లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి

ఇప్పుడు పొయ్యిని ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత కట్టేసుకోవాలి

చింతపండు పేస్ట్ రెడీ ఐపోయినట్టే

ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో ఈ పేస్ట్ను కలుపుకుని పులిహోర తయారుచేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com