×
spinner

వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ Vegetable Fried Rice

2 weeks ago | Home Cooking Telugu
DESCRIPTION
వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ను అన్ని వయసులవారూ ఆస్వాదిస్తారు. చాలా తక్కువ పదార్థాలతో సులువుగా చేసుకోగలిగే వంటకాల్లో ఇదొకటి. అందుకే రుచికరమైన ఈ ఫ్రైడ్ రైస్ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించడానికి ఇవాళ మీ ముందుకు వస్తున్నాం. ఈ రెసిపీని చూసి ట్రై చేసి ఎంజాయ్ చేయండి

#vegetablefriedrice #ricerecipes #chineserecipes

Here's the link to this recipe in English: https://bit.ly/2VcWYKY

తయారీకి కావలసిన సమయం: 15 నిమిషాలు
వండటానికి కావలసిన సమయం: 30 నిమిషాలు
సెర్వింగులు: 4 - 5

కావలసిన పదార్థాలు

నూనె - 2 టేబుల్స్పూన్లు
వెల్లుల్లి - 1 (తరిగినది)
ఉల్లికాడల తెల్ల గడ్డలు
క్యారెట్ - 1
బీన్స్
క్యాబేజి - 1 కప్పు (తరిగినది)
ఉడకపెట్టిన స్వీట్ కార్న్ - 1 / 2 కప్పు
బేబీ కార్న్
ఉప్పు - 3 /4 టీస్పూన్
మిరియాలు
లైట్ సొయా సాస్ - 2 టేబుల్స్పూన్లు
వెనిగర్ - 1 టేబుల్స్పూన్
పంచదార - 1 /4 టీస్పూన్
ఉల్లికాడలు

బాస్మతి బియ్యం - 1 కప్పు (250 మిల్లీలీటర్లు)
నీళ్లను మరిగించాలి
అన్నాన్ని ముప్పావు శాతం వరకు ఉడికించాలి
వేయించాలి
ఉడికించిన బాస్మతి బియ్యం

తయారుచేయు విధానము

1। ముప్పావు శాతం ఉడికిన అన్నాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి
2। ఒక బాండీలో నూనెను వేడి చేసి వెల్లుల్లిని వేయించుకోవాలి
3। ఉల్లిపాయలు వేసి వేయించిన తరువాత మిగిలిన కూరగాయలన్నిటినీ కూడా వేసి పెద్ద మంట మీద వేయించుకోవాలి
4। ఇప్పుడు వీటిలో సొయా సాస్, వెనిగర్, పంచదార, మిరియాల పొడి, ఉప్పు కూడా వేసి అన్నీ బాగా కలపాలి
5। ఇవన్నీ కొద్దిగా వేగిన తరువాత వార్చిన అన్నాన్ని కలుపుకోవాలి
6। కూరగాయలు, సాస్లు అన్ని అన్నానికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి
7। ఉల్లికాడలు వేసిన వెంటనే పొయ్యి కట్టేసుకోవాలి
8। ఇప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కాబట్టి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com